సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక ఫైనాన్షియర్ గా కనిపించనుండగా కీర్తి సురేష్ బ్యాంక్ ఎంప్లాయ్ పాత్ర చేస్తున్నట్లు టాక్. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థ వారు ఎంతో భారీగా ప్రతిష్టాత్మక స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు ఇటీవల అఖండ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం అటు ఆహా ఒటిటిలో అన్ స్టాపబుల్ పేరుతో ఒక షో ని హోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షోకి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ షో తాలూకు ప్రస్తుత సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ని ఇటీవల చిత్రీకరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో మొన్న రిలీజ్ అయి అందరినీ ఎంతో అలరిస్తోంది. ఈ ప్రోమోలో మహేష్ బాబు, బాలయ్య ఇద్దరూ కూడా తమ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. అలానే మహేష్ ప్రస్తుతం 1058 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన విషయమై బాలయ్య, మహేష్ ని ప్రత్యేకంగా అభినందించడం ప్రోమోలో చూడవచ్చు.

ఆ విధంగా అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో 4.7 మిలియన్ వ్యూస్ తో పాటు 230కె లైక్స్ ని సొంతం చేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ పొందిన ఓటిటి ప్రోమోగా నిలిచినట్లు సమాచారం. ఇప్పటికీ ఈ ప్రోమో యూట్యూబ్ లో టాప్ 3 స్థానంలో నిలిచి ఉండడం విశేషం అని అంటున్నారు విశ్లేషకులు. ఆ విధంగా బాలయ్య, మహేష్ ఇద్దరూ కూడా ఈ ప్రోమోతో యూట్యూబ్ ని చెడుగుడాడుతున్నారని, తప్పకుండా ఈ స్పెషల్ ఎపిసోడ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుందని ఆహా యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: