మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఇప్పుడు సూపర్ ఫాం తో దూసుకెళ్తున్నాడు. అతను చేస్తున్న సినిమాలు వరుస బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టడంతో థమన్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది. థమన్ మ్యూజిక్ అంటే ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంద్దని ఫిక్స్ అవుతున్నారు ప్రేక్షకులు. ఆ విధంగా తన బ్రాండ్ కొనసాగిస్తున్నాడు థమన్. తెలుగు లో థమన్ హవా నడుస్తుంది. అయితే చేస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ కు అప్పుడప్పుడ్డు సర్ ప్రైజెస్ ఇస్తుంటాడు థమన్. ఈ క్రమంలో లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా నుండి ట్యూన్ ఒకటి లీక్ చేశాడు.

మేకర్స్ పర్మిషన్ తీసుకున్నాడో లేదో కానీ సర్కారు వారి పాట నుండి ఓ సూపర్ ట్యూన్ ని థమన్ మహేష్ ఫ్యాన్స్ కోసం లీక్ చేశాడు. మహేష్, థమన్ అంటే సూపర్ హిట్ కాంబోనే అని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ లో ఇదివరకు దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలు వచ్చాయి. మహేష్ కి ఎప్పుడూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తూ వస్తున్న థమన్ సర్కారు వారి పాటకి కూడా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని అంటున్నారు. లీక్ చేసిన ట్యూన్ అయితే బాగానే ఉంది.

సర్కారు వారి పాట సినిమా తో పాటుగా త్రివిక్రం, మహేష్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. థమన్ మ్యూజిక్ అంటేనే అదిరిపోతుంది అందులో త్రివిక్రం డైరక్షన్ లో మ్యూజిక్ అంటే సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. మహేష్ సర్కారు వారి పాట, త్రివిక్రం సినిమా రెండు వరుస సినిమాల మ్యూజిక్ తో థమన్ మరోసారి తన మ్యూజిక్ టాలెంట్ చూపించనున్నాడు. ఓ పక్క దేవి శ్రీ ప్రసాద్ కూడా దూసుకెళ్తుంటే థమన్ కూడా ఓ పక్క వరుస హిట్లతో దేవి తో ఫైట్ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: