సోషల్ మీడియాలో ఎప్పుడూ స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు అభిమానులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని నిజాలు ఉంటే కొన్ని మాత్రం కేవలం గాసిప్స్ గా మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవలే ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు సంపాదించాడు దర్శకుడు మారుతి.


 ప్రస్తుతం గోపీచంద్ తో కలిసి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక మారుతి సినిమా వస్తుందంటే కథ బలంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ మారుతి తో సినిమా చేసేందుకు సిద్ధం అయిపోయాడు అంటూ ఒక టాక్ వినిపించింది.  ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారు అంటూ టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తున్న ప్రభాస్ మారుతితో నిజంగానే సినిమా చేయబోతున్నాడా అన్న చర్చ మొదలయింది.


 తాజాగా ఇదే విషయంపై దర్శకుడు మారుతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతట అవే బయటకు వస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు మారుతి. అప్పటి వరకు అందరూ వేచి ఉండాల్సిందే అంటూ తెలిపాడు. నా భవిష్యత్ ప్రాజెక్టులు ఏంటి వాటి టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సినిమాలో నటించే తారాగణం ఎవరు అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. కానీ సమయమే అన్నింటినీ బయటపడుతుంది అంటూ చెప్పిన మారుతీ.. దర్శకుడిగా నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. దీంతో ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందా లేదా అన్న చర్చ మళ్ళీ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: