మన టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉంటూ స్టార్ హీరో గా  సత్తా చాటుతున్న వారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. హీరోగానే కాకుండా వ్యాపారవేత్తగా, నిర్మాతగా వేర్వేరు రంగాలలో రామ్ చరణ్ తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం చరణ్ హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల అవుతున్నాయి.ఇదిలా ఉంటె రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ తెరకెక్కిన 'ధ్రువ' సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వివరించడం జరిగింది. 

సైరా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి తాజాగా చెప్పుకొచ్చారు సురేందర్రెడ్డి.' సైరా సినిమా లోని కొన్ని సన్నివేశాల షూటింగ్లను బల్గేరియాలో జరిపామని.. సాధారణంగా సినిమాల కోసం సెట్ వేస్తామని, అయితే సైరా సినిమాకు పనిచేసే వాళ్ళ కోసం సెట్స్ వేసామని తెలిపారు. అయితే బల్గేరియాలో విపరీతమైన గాలి వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని.. ఎడారిలా ఉండే ఆ ప్రాంతంలో టెక్నీషియన్లను, నటీనటులను ఉండడం కోసం రామ్ చరణ్ వాళ్లకు బాత్ రూమ్స్, బెడ్రూమ్స్  ఏర్పాటు చేయించారని.. ఇందుకోసం రామ్ చరణ్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని సురేందర్ రెడ్డి తెలిపారు. 

అంతేకాదు గుఱ్ఱాల కోసం ఏకంగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక షెడ్డు వేయించారని చెప్పుకొచ్చారు. వేరే నిర్మాత అయితే అంత శ్రద్ధ తీసుకోరు.. కానీ రామ్ చరణ్ కి మాత్రమే అలాంటి శ్రద్ధ తీసుకోవడం సాధ్యమవుతుందని సురేందర్రెడ్డి చరణ్ పై కామెంట్ చేశాడు. దీంతో చరణ్ గొప్పతనం గురించి చెబుతూ సురేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్  డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: