రష్మిక మందన్న.. ఈమె క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.. సోషల్ మీడియా లో ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన ముద్దుగుమ్మగా..నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె మొదటి సారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు పర్వాలేదు అని అనిపించుకుంది.. కానీ ఆ తర్వాత తన నటనతో, ముఖ భావాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా లో జోడీ కట్టిన ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాలో కూడా శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక ఓవర్ నైట్ లో నే హీరోయిన్ గా చలామణి కావడం మరో విశేషం. రోజురోజుకు ఈమె క్రేజ్ పెరిగిపోతుండడంతో ఆమె అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు . కానీ ఇటీవల చేసిన ఒక పని కి నెటిజన్స్  అందరూ ఛీ.. ఛీ..అంటూ ఆమె పై మండిపడుతున్నారు. అయితే నెటిజన్స్ ఆగ్రహానికి గురి అయ్యే అంత పని రష్మిక ఏమి చేసింది అనే విషయానికి వస్తే.. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో మంచి సక్సెస్ ను  అందుకని బాలీవుడ్ కి మకాం మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో అందరికీ కనిపించి షాక్ ఇచ్చింది. నిజానికి ఆమె డ్రెస్సింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. వైట్ కలర్ టీ షర్ట్, షార్ట్ వేసుకొని ముఖానికి మాస్కు తో అందరికీ దర్శనమిచ్చింది.. దీంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక పిక్కలు కనిపించేలా డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి..? క్రేజ్ పెరిగితే బట్టలు సైజు కూడా తగ్గుతుందా..? అంటూ ఆమెను విపరీతంగా రోల్ చేస్తున్నారు అంతేకాదు దుస్తులు వేసుకోవడం మర్చిపోయావా ఏంటి..? ఇది మరీ ఓవర్.. అంటూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: