తెలుగు బుల్లితెరను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇటీవలే 5 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐదవ సీజన్ లో హోస్ట్ గా కింగ్ నాగార్జున విఫలం అయ్యారనే వార్తల నేపథ్యంలో  6 వ సీజన్ ని నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ బిగ్ బాస్ ఆరవ సీజన్ కూడా తానే హోస్ట్ గా ఉండబోతున్నట్లు చెప్పారు నాగార్జున. ఇక త్వరలోనే ఆరో సీజన్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ విషయం గురించి ఆసక్తిగా చర్చలు నడుస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలోనే బిగ్ బాస్ ఆరో సీజన్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సీజన్లకు కాస్త భిన్నంగా ఆరవ సీజన్ని ప్లాన్ చేస్తున్నట్లు నిర్వాహకులు. ఇక ప్రస్తుతం నిర్వాహకులు దాని కోసం కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలో కూడా పేరున్న సెలబ్రిటీస్ పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఆమె కథ, వాణి రాణి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నవ్య స్వామి, డీజే కమ్ నటుడు బబ్లు, జబర్దస్త్ సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రత్యూష, సరిలేరు నీకెవ్వరు ఫేమ్ సేతురామన్, యూట్యూబ్ యాంకర్ శివ, యాంకర్ వర్షిని, జబర్దస్త్ దొరబాబు, నటి సురేఖ వాణి, డీ 10 డాన్సర్ రాజు తదితరులు ఇప్పటికే సెలెక్ట్ అయ్యారని అంటున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం హిజ్రా ఫౌండర్ స్పోక్ పర్సన్ చంద్రముఖి కూడా బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళబోతుందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఇటీవలే చంద్రముఖికి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చిందని.. అయితే ఆమె ఓటీటీకి కాకుండా ఆరవ సీజన్ కి వెళ్లడానికి సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చిన చంద్రముఖి..' నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా వెళ్తాను. సోషల్ మీడియాలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. అక్క బిగ్ బాస్ కి వెళ్లొచ్చు కదా అని. నిజానికి గతంలోనే బిగ్ బాస్ సీజన్ 3 కి నన్ను అడిగారు. కానీ ఆ సమయంలో నా పరిస్థితి బాలేదు. అందుకే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్తాను' అని చెప్పుకొచ్చింది. మరి 6వ సీజన్ కి నిర్వాహకులు చంద్రముఖిని తీసుకుంటారా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: