టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా కోలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో విజయ్ ఉన్నారు. ఈయనకు అటు తమిళ్ మరియు తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ తమ కెరీర్ లో బిజీ గా ఉన్నారు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఒక సారూప్యత ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులని కూడా తెలిసిన విషయమే. మహేష్ బాబు తెలుగులో చేసిన సినిమాలను కొన్ని విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. కానీ ఎప్పటి నుండో ఒక సమస్య మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉంది.

ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరికీ అభిమానులు ఉండడం సహజమే. హీరోలు అందరూ కలిసి మెలిసి సరదాగా ఉంటారు. కానీ ఈ హీరోలను ఎంతగానో ఆరాధించే అభిమానులు మాత్రం తమ హీరోల కోసం నిత్యం సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఈ వివాదాలు చాలా దూరం వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ మరియు విజయ్ అభిమానుల మధ్యన సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. అయితే ఎందుకు ఈ గొడవ మొదలైంది అనే విషయానికి వస్తే, నిన్ననే "సర్కారు వారి పాట" నుండి కళావతి సాంగ్ ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. మరియు అదే రోజున విజయ్ లేటెస్ట్ గా నటించిన బెస్ట్ సినిమా నుండి మొదటి సాంగ్ రానుంది.

అయితే ఎవరిపాట బాగుంటుంది? అనే విషయంపై ఇప్పటి నుండే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ మొదలైంది. వీరిరువురి అభిమానులు సాంగ్ యొక్క లికెస్ నుపెంచడానికి ఏవేవో ట్రిక్స్ చేస్తారని పరస్పరం ఆరోపంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఇది ఎంత దూరం వెళుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: