ప్రభాస్ “బాహుబలి” తో  పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ దెబ్బతో ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు టాప్ మోస్ట్ డైరెక్టర్లు నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.అయితే ప్రభాస్ మార్కెట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండటంతో ప్రభాస్ తో ఒక్క బొమ్మ పడితే బ్లాక్ బస్టర్ అయితే తిరుగు ఉండదు అని చాలామంది డార్లింగ్ తో సినిమా చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు.ఇక పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ “రాదే శ్యాం” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉండటం తెలిసిందే. అంతేకాదు వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. 

అయితే పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో అలాగే పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో కనిపించనునన్నారు. కాగా ఇదిలా ఉండగా  ఈ సినిమాలో మహేష్ బాబు తెలుగు వర్షన్ కి సంబంధించి ఒక వాయిస్ ఓవర్ ఇవ్వటానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన “జల్సా” సినిమాకి మహేష్ స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఇప్పుడు ఇదే తరహాలో ప్రభాస్ “రాదేశ్యం”లో మహేష్ వాయిస్ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. ఇక ఇటీవలె ఏపీ సీఎం వైఎస్ జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు ఈ సమయంలో ప్రభాస్ మహేష్ చాలా ఫ్రెండ్లీగా నవ్వుకుంటూ కనిపించారు.

దీనివల్ల దాదాపు మూడు రోజులపాటు వీళ్ళిద్దరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నెటిజన్ ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా దీంతో మహేష్ చేత వాయిస్ ఇప్పిస్తే బాగుంటుందని “రాదేశ్యం” సినిమా యూనిట్ తాజాగా సూపర్ స్టార్ ని కోరగా ఓకే చెప్పినట్లు టాక్. తాజాగా ప్రభాస్ సినిమాలో మహేష్ వాయిస్ వినిపించే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.అంతేకాదు ఇదే వాయిస్ హిందీలో అమితాబ్ బచ్చన్ చెప్పనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: