దాదాపు రెండేళ్లకు పైగా నిర్మాణంలో వున్న సినిమా ఇప్పటకే ఒకటికి మూడు సార్లు రిలీజ్ డేట్ లు మార్చుకుంది.. ఈ సినిమా నిర్మాణానికి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చువుతుందని గతంలో వార్త వినిపించింది.
అయితే అన్ని ఖర్చులు, వడ్డీలు అన్నీ కలిపి అయిదు వందల కోట్లకు చేరిపోయినట్లు సమాచారం.అయితే సినిమాను ఎంత గ్రాండ్‌గా రూపొందిస్తారో ప్రమోషన్స్ విషయంలో అంతకంటే ఎక్కువ శ్రద్ద పెట్టేరాజమౌళి rrr కోసం పక్కా ప్లాన్స్ వేసుకున్నారని సమాచారం.. ఈ నేపథ్యంలో rrr ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ గురించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చిందట.
నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు కానీ ఊహించని విధంగా కరోనా దాడితో పోస్ట్ పోన్ చేయక తప్పలేదు.. అయితే రిలీజ్ కాపీ రెడీ చేసుకున్న జక్కన్న.. డిసెంబర్ నెల నుంచే భారీ రేంజ్ ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా, విడుదల వాయిదా పడ్డాక కాస్త విరామం తీసుకున్న ఆయన, ఇక ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటున్నారని సమాచారం..
సరికొత్త స్ట్రాటజీలతో వెళ్లాలని టీమ్ అందరికీ సూచిస్తున్నారట. ఈ క్రమంలోనే భారీ ఈవెంట్స్ నిర్వహించేందుకు కసరత్తులు కూడా షురూ చేశారట రాజమౌళి. మునుపెన్నడూ చూడనంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్ ఉండాలని భావిస్తున్న ఆయన అందుకోసం రెండు ఏరియాలు సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం.హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తుంది..
ఈ ఈవెంట్ కన్నుల పండగ కావాలని, వివిధ భాషల్లోని స్టార్ హీరోహీరోయిన్లకు సైతం ఆహ్వానం పంపాలని రాజమౌళి చూస్తున్నారట. అతి త్వరలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు సంబంధించిన డేట్స్ ప్రకటించనున్నారని సమాచారం. రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న నేసథ్యంలో ప్రమోషన్ క్లాష్ ఎందుకనే ఉద్దేశంతో ప్రస్తుతం జక్కన్న టీమ్ కాస్త సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ విడుదల తర్వాత rrr టీమ్ రంగంలోకి దిగబోతోందని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి