ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆమె చేసిన మూడు సినిమాలు కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆమెకు భారీ స్థాయిలో అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రామ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మాస్ మసాలా సినిమా ది వారియర్. తెలుగు, తమిళం రెండు భాషలలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఓ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.

కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు పోషిస్తూనే తన కెరియర్ ను ముందుకు వెళ్లే విధంగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా ఈమె ఒప్పుకుంటుంది. అలా సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విధంగా రెండు వైవిధ్యమైన సినిమాలను ఒకేసారి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తనలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తూ సినిమాలు చేస్తున్న కృతి భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవ్వడం ఖాయమని ఎప్పుడో నిర్ణయించారు. వారు నిర్ణయించిన విధంగానే ఆమె సినిమాల ఎంపికలో బాగా కేర్ తీసుకుంటుంది.

తాజాగా ఆమెకు మరొక భారీ సినిమా అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఈమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇంకొకవైపు శర్వానంద్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కూడా కథానాయికగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా స్టార్ హీరోలతో యంగ్ హీరోలతో కలిసి సినిమాలను చేస్తూ నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతుంది కృతి.
 అయితే మహేష్ బాబు సినిమా అవకాశాన్ని ఆమె వడులుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: