ఇండస్ట్రీకి ఇచ్చిన కొంత కాలంలోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది రష్మికా మందన్న. ఇకపోతే రష్మిక మందన వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు  సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అభిమానులకు ఎప్పటికప్పుడు తన సినిమాలకు అప్డేట్లు పోస్ట్ చేయడమే కాదు.. ఫన్నీ వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవలే ఒక అదిరిపోయే పాట పై అంతకుమించిన అదిరిపోయే స్టెప్పులు వేసిన రష్మి క ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.



 వీడియో కాస్త ప్రస్తుతం నెటిజన్లు అందరినీ ఆకర్షిస్తుంది. ఇంతలి ఏ పాటపై  డాన్స్ చేసిందో తెలుసా... ఇంకే పాట ఇటీవలి కాలంలో సెలబ్రిటీల అందర్నీ కూడా కాలు కడిపేలా చేస్తూ డాన్స్ స్టెప్పులు వేయిస్తున్న అరబిక్ కుతూ పాట. హీరో ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతూ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఇక ఈ పాట పై అటు ఎంతోమంది  సెలబ్రిటీలు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బీస్ట్ సినిమాలో నటించిన పూజ హెగ్డే ఈ పాటపై డాన్స్ చేసింది.. ఇక మొన్నటికి మొన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సైతం అరబిక్ కుతూ పాట పై కాలు కలిపింది.


 ఇక ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన సైతం ఈ పాటకి డాన్స్ చేసి అదరగొట్టింది. బాలీవుడ్ హీరో వరుణ్ధావన్ తో కలిసి రష్మిక మందన అరబిక్ పాటకి డాన్స్ చేసి ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఎంతో అద్భుతంగా డాన్స్ చేసింది రష్మిక అంటూ అటు అభిమానులు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: