సైన్స్ మంత్రాలు దైవశక్తి ఇలా ఈమూడు విషయాలు వేరువేరు భిన్న ధృవాలు. ఈమూడు విషయాలు ఒకదానికొకటి ఇమడవు. దీనితో ఈమూడు విషయాల పై ఎప్పుడు అనేక చర్చలు వివాదాలు నడుస్తూనే ఉంటాయి. లేటెస్ట్ గా ఈవిషయాలలోకి ఉపాసన ఎంటర్ అయింది. అపోలో వైస్ ఛైర్ పర్సన్ గా అనేక విజయాలు సాధిస్తున్న ఉపాసన మానసిక ఆరోగ్యం గురించి ఎప్పుడూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.
ఈమధ్య ఈమె ‘మందులు తీసుకునే ముందు మీరు మహా మృత్యుంజయ మంత్రాన్ని రెండు లేక మూడు సార్లు జపిస్తే అది మీకు బాగా పని చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. నేను దాని గురించి ఇటీవల చదివాను’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఒక ప్రముఖ కార్పోరేట్ హాస్పటల్ కు డైరెక్టర్ గా ఉన్న ఉపాసన ఇలా మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఏమిటి అంటూ కొందరు ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరైతే ఉపాసన ఉద్దేశ్యం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాదని దీనిపై అనేక పరిశోధనలు జరిగిన పరిస్థితులలో ఆవిషయాలను ఉపాసన తన అభిమానులతో షేర్ చేసుకుంది కాని ఆమెకు మూఢనమ్మకాలను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదు అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈమధ్య కరోనా సమయంలో సూర్యనమస్కారాలు వల్ల ఆవ్యాధి త్వరగా తగ్గుతుంది అంటూ అనేక పరిశోధనల వివరాలు బయటకు వచ్చాయి. కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కూడ సూర్య నమస్కారాలతో తాను పొందిన మానసిక ప్రశాంతతను వివరించింది. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉపాసన ఇలా తన అభిప్రాయాలు వెల్లడించింది అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి