కానీ అలాంటి అంచనాల మధ్య ఆర్య-2 చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే తాజాగా ఆర్య సినిమా వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు గా సమాచారం. మొదటగా ఈ సినిమా కథ హీరో రవితేజకు చెప్పగా ఆయన కథ విన్న తర్వాత తనకి వర్కవుట్ కాదని తెలియజేశాడు. అలాంటి సమయంలో రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని చేయలేను అని తెలియజేశారట.
ఇక ఆ తర్వాత ఈ సినిమా స్టోరీ ని ప్రభాస్ కి వినిపించగా.. ఇప్పటికిప్పుడే ఇలాంటి స్టోరీ తో సినిమా చేయాలేను అని ప్రభాస్ చెప్పేశాడట. దీంతో ఈ సినిమాను అల్లుఅర్జున్ వద్దకు తీసుకెళ్లగా అల్లు అరవింద్ కూడా ఈ సినిమా స్టోరీ నచ్చడంతో. అవకాశం ఇచ్చారు. అలా ఆర్య చిత్రం విడుదలై మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని రవితేజ ,ప్రభాస్ ఎవరో ఒకరు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.. ఈ చిత్రం ఎవరికి ఎలా బాగుంటుంది అనేది ఎవరూ చెప్పలేము. అయితే ఈ చిత్రాన్ని ఈ స్టార్ హీరోలు నో చెప్పడంతో అల్లు అర్జున్ హీరోగా ఎదగడానికి ఏ సినిమా సహాయ పడిందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి