పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్,  ఈ మూవీ కి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు,  ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ కథానాయిక గా నటించగా,  దగ్గుబాటి రానా సరసన కేరళ బ్యూటీ సుంయుక్త మీనన్ కథానాయికగా నటించింది, ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు, తమన్ సమకూర్చిన సంగీతం ఈ సినిమా సాంగ్స్ కు విడుదలకు ముందు నుంచే మంచి ప్రేక్షకాదరణ లభించింది,  ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీ న థియేటర్ లలో విడుదల అయ్యింది.

 భీమ్లా నాయక్ మూవీ విడుదలైన మొదటి  షో నుండే సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది, భీమ్లా నాయక్ మూవీ మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల కు పైగా కలెక్షన్ లను సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించింది,  కాకపోతే  ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఈ మూవీ కలెక్షన్ లు డ్రాప్ అవుతూ వచ్చాయి. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేవడం తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లు గా నమోదైంది, ఇది ఇలా అనే ఈ మూవీ మూడు వారాల్లోనే రూ. 97.43 కోట్లు వసూలు చేసింది.  అంటే మరో రూ. 10.55 కోట్లు వసూలు చేస్తేనే భీమ్లా నాయక్ మూవీ హిట్ స్టేటస్‌ ను సొంతం చేసుకుంటుంది,  ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ ఈ నెల 25 వ తేదీ నుండి 'ఓ టి టి'  లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: