అప్పటిలో వచ్చిన కొన్ని సినిమాలు జనాలను ఎంతగా ఆకట్టుకుంటూ వస్తున్నాయొ ప్రత్యెకంగా చెప్పనక్కర్లెదు. ఆ సినిమాలు హిట్ అవ్వడం తో పాటుగా అందులో జనాలకు బాగా నచ్చిన కొన్ని సీన్లు ఇప్పటికీ వినిపిస్తూ వస్తున్నాయి.. ఆ సినిమాలను తలపించెలా ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలు రావడం విశేషం.. అందులోనూ ఖుషి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా మళ్ళీ తెర మీద కనిపించడం గ్రేట్..అది కాక మెగా హీరో తో మళ్ళీ సినిమా రావడం మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. పవన్ ఫ్యాన్స్ కు పునకాలే..


వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం తో తర్వాత కొండ పొలం సినిమాలో నటించారు. అది అనుకున్న ఫలిథాలను ఇవ్వలేక పోయింది..దాంతో బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో సినిమా వేట లో పడ్డాడు.రంగరంగ వైభవంగా' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఎవర్‌గ్రీన్ మూవీ 'ఖుషి'ని తలపించే విధంగా కీలక సన్నీవేశాలు ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


రంగరంగ వైభవంగా చిత్రంలో హీరో ఓ మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తాడట. అయితే హీరోయిన్‌తో అతడికి ఏర్పడే మనస్పర్థల కారణంగా వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనే సన్నివెసాలు అన్నీ పవన్ కళ్యాణ్ ను గుర్తు  చేస్తున్నాయి. కొంచెం కొత్తగా ఖుషి సినిమాను రిపీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతుందని వారు అంటున్నారు. మరి వైష్ణవ్ తేజ్ నిజంగానే ఖుషి సినిమా స్టోరీలైన్‌తో వస్తున్నాడా లేక ఇదంతా కేవలం సినిమా పై అంచానాలను క్రియేట్ చెయాదానికి చేస్తున్న కొత్త ప్రయత్నమా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందె.

మరింత సమాచారం తెలుసుకోండి: