ఇక ఇద్దరు అన్నదమ్ములు ఏ సినిమాకు డైలాగులు రాసిన ఆ సినిమా డైలాగ్ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అని తెలుగు ప్రేక్షకులు నమ్ముతుంటారు. ఇక హీరో బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే విధంగా డైలాగులు రాస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పరుచూరి బ్రదర్స్ అంటే పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు. ఇద్దరూ 300కు పైగా సినిమాలకు పని చేశారు అని చెప్పాలి.అయితే సాధారణంగా ఇద్దరు సొంత అన్నదమ్ములు కావడం వల్ల వీరిని పరుచూరి బ్రదర్స్ అని పిలుస్తూ ఉంటారు అని అనుకుంటారు అందరు.
ఇద్దరిని పరుచూరి బ్రదర్స్ అని పిలవడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కరిని బ్రదర్ అంటూ పిలిచేవారు. ఇక ఈ ఇద్దరినీ కూడా పేరు పెట్టి పిలవడం కాకుండా పరుచూరి బ్రదర్స్ అనడం మొదలు పెట్టారట సీనియర్ ఎన్టీఆర్. ఇక ఇలా అన్నగారు పిలవడం చూసిన ఎంతోమంది వీరిద్దరి పేర్లు పెద్దగా ఉండటంతో ఇక కాస్త చిన్నగా పరుచూరిబ్రదర్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇక అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో వీరి పేరు పరుచూరి బ్రదర్ గానే ముద్ర పడిపోయింది. ఏ సినిమాకి పనిచేసిన కూడా వీరు పేరు పరుచూరి బ్రదర్స్ అని వేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి