నట సింహం బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా నుంచి తాజాగా 'బాలయ్య పవర్ ఫుల్ లుక్' బయటకు వచ్చింది.


ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ హీరో దునియా విజయ్‌ విలన్‌ గా నటిస్తున్నాడట. ఉగాది సందర్భంగా బాలయ్యకు పూల బుకే ఇస్తూ దిగిన ఫొటోని దునియా విజయ్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. బాలయ్య ఓల్డ్‌ గెటప్‌లో మాస్‌ గా కనిపించగా, దునియా విజయ్‌ అందుకు తగ్గట్టు పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించి మెప్పించాడు..



మొత్తానికి దునియా విజయ్‌ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో బాలయ్య లుక్ అయితే అదిరిపోయింది. అన్నట్టు బాలయ్య లుక్ కి సంబంధించి ఆ మధ్య ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది టీం. బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్య. లుంగీతో దర్శనమిచ్చాడు. పైగా బ్లాక్ కారు పక్క నుంచి బాలయ్య అలా నడుస్తూ వస్తుంటే చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. మొత్తానికి బాలయ్య స్టైలిష్ మాసివ్ లుక్ లో అదరగొట్టాడు.




ఇక ఆ పోస్టర్ ను బట్టి మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా నడిచేలా ఉందని తెలుస్తుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య లుక్ చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌ గా సిరిసిల్లలో ప్రారంభమైందని సమాచారం.. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు అయిన దునియా విజయ్ అద్భుతంగా నటిస్తున్నాడట.


ఈ సినిమాలో మరో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారని సమాచారం.. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి. మన 'బాలయ్య బాబు' అరవై ఏళ్ల వయసులో 'అన్ స్టాపబుల్'లా దూసుకువెళ్తున్నాడు. ఏది ఏమైనా 'అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అయితే నేషనల్ రేంజ్ లో పాకింది. బాలయ్యకి అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. క్రేజ్ కూడా డబుల్ అయింది.



బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారట.. పైగా బాలయ్య ముందు ఆలోచించేదే నిర్మాత గురించి. నిర్మాత లాభం కోసం, బాలయ్య అర్ధరాత్రులు కూడా పని చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే, బాలయ్య డేట్లు కోసం ఇప్పుడు అందరూ కూడా ఎగబడుతున్నారు. ప్రస్తుతం బాలయ్యకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: