నందమూరి సింహం బాలకృష్ణకు కోపం వచ్చినా ప్రేమ కల్గినా హద్దులు ఉండవు. తన మనసులోని మాటను చాల స్పష్టంగా మాట్లాడే బాలకృష్ణ అనేకసార్లు అతడు చేసే కామెంట్స్ వల్ల కొన్ని విమర్శలు కూడ ఎదుర్కున్నాడు. అయితే బాలయ్య ఈవిషయాలను అంతగా పట్టించుకోడు.


తన సినిమాల జయాపజయాల గురించి అదేవిధంగా రికార్డుల గురించి కూడ బాలకృష్ణ పట్టించుకోకపోవడంతో అతడు తాను అందుకోవలసిన నెంబర్ వన్ స్థానాన్ని అందుకోలేకపోయాడు అన్న అభిప్రాయం అతడి అభిమానులలో ఉంది. గతంలో బాలకృష్ణ జగపతి బాబు కెరియర్ చాల కష్టాలలో ఉన్నప్పుడు అతడికి విలన్ గా బ్రేక్ ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు.


ఇప్పుడు నటుడు పృథ్వీరాజ్ కు సినిమాలలో అవకాశాలు రావడంలేదు.  ఒకప్పుడు ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పంచ్ డైలాగ్ తో ఒక వెలుగు వెలిగిన పృథ్వీరాజ్ ఆతరువాత రాజకీయాలలోకి ఎంటర్ అయి వైఎస్ఆర్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదగడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవెంకటేశ్వరా భక్తి ఛానల్ కు చైర్మన్ స్థాయికి ఎదిగాడు. అయితే అక్కడ కొన్ని వివాదాలలో చిక్కుకోవడంతో ఆపదవిని కోల్పోవడం జరిగింది. దీనితో రాజకీయాలను వదిలి యూటర్న్ తీసుకుని సినిమాల వైపు వచ్చినా ప్రస్తుతం అతడిని ఎవరు పట్టించుకోవడం లేదు.


అయితే ఇతడు సమస్యలలో ఉన్నాడని గ్రహించిన బాలయ్య తాను గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీలో పృధ్వీరాజ్ కీలక పాత్రను ఇప్పించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో బాలయ్యను ఎంతగానో విమర్శించిన పృధ్వీరాజ్ కు ఆవిషయాలను పక్కకు పెట్టి అతడికి బాలయ్య అవకాశాలు ఇప్పించడం అతడి మంచిమనసుకు నిదర్శనం అంటూ అభిమానులు ఆనంద పడుతున్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్న విషయాన్ని పదేపదే బాలకృష్ణ తన ఉపన్యాసాలలో చెపుతూ ఉంటాడు. అంతేకాదు సినిమా నటులకు రాజకీయాలు తెలియవనీ కూడ బాలయ్య అభిప్రాయం. ఇప్పుడు పృధ్వీరాజ్ కు బాలయ్య చేసిన సహాయం బట్టి అతడ్ మంచి మనసు మరొకసారి అర్థం అవుతుంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: