‘ఆర్ ఆర్ ఆర్’ హడావిడి ముగిసిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్ సినిమాల ఎంపిక పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీని చేయడానికి అంగీకరించిన జూనియర్ ఆసినిమాలోని తన పాత్ర కోసం కనీసం 20 కేజీల బరువు తగ్గాలి అని కొరటాల కోరడంతో అలా బరువు తగ్గడానికి జూనియర్ తన డైటీషిన్ సలహాతో తన ఆహారపు అలవాట్లతో మార్పులు చేసుకున్నట్లు టాక్.
ఈమూవీ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం అయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈమూవీలో జూనియర్ ప్రభుత్వ వ్యవస్థ పై తిరుగుబాటు చేసే ఒక ఐఎఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఈమూవీని చేస్తూనే జూనియర్ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చడంతో ఆమూవీని కూడ సమాంతరంగా చేయాలని భావిస్తున్నట్లు టాక్.
అయితే ఈమూవీ కథ రీత్యా జూనియర్ అంగవైకల్యం కలిగిన క్రీడాకారుడుగా కనిపిస్తాడట. దీనితో తన పాత్రలో సహజంగా కనిపించదానికి జూనియర్ అంగవైకల్యంతో బాధపడే వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొంతవరకు రిసర్చ్ కూడ చేస్తున్నాడట. అంగవైకల్యంతో బాధపడే క్రీడాకారుడు అనేక అవమానాలను ఎదుర్కుని ప్రపంచ స్థాయిలో జరిగే ప్యారా ఒలింపిక్స్ లో దేశానికి స్వర్ణపతకం ఎలా తీసుకు వచ్చాడు అన్న కథతో ఈమూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
గతంలో సీనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో ‘భీష్మ’ మూవీలో వృద్ధుడుగా మరొక సినిమాలో గుడ్డి వాడుగా నటించిన విషయాలు తెలిసినవే. ఇప్పుడు అదే స్పూర్తిని కొనసాగిస్తూ తారక్ ఇలా అంగవైకల్యం ఉన్న పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అతడి ధైర్యాన్ని సూచిస్తోంది అంటూ అప్పుడే ప్రశంసలు మొదలైపోయాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సూపర్ సక్సస్ అయినప్పటికీ ఆమూవీ ద్వారా జూనియర్ కు బాలీవుడ్ లో తగిన గుర్తింపు రాలేదు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో జూనియర్ నటించబోయే ఈరెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా నిర్మాణం జరుపుకుంటాయ లేదంటే తెలుగు సినిమాలుగానే మిగిలిపోతాయ అన్నవిషయానికి క్లారిటీ లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి