తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈయన డైరెక్షన్లో ఎవరైనా సినిమా చేశారు అంటే కచ్చితంగా ఆ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పవచ్చు. అందుకే స్టార్ హీరోలు సైతం త్రివిక్రమ్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కలసి భీమ్లా నాయక్ సినిమా ను తెరకెక్కించి..మంచి విజయం పొందాడు త్రివిక్రమ్..ఏకంగా ఈ సినిమాతో కొన్ని కోట్ల షేర్ ను వసూల్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే ఈ సారి ఏకంగా మరో ఇద్దరూ స్టార్ హీరోలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. మొన్నటి వరకూ ఎన్టీఆర్ తో కలసి అయిననూ పోయిరావలే అస్థిన కు అనే సినిమాను తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు త్రివిక్రమ్ . కానీ కొద్దిరోజులు నందమూరి ఫ్యామిలీ కి దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నట్లు..ఈ ప్రాజెక్ట్ పక్కకు నెట్టడం తో అర్థం అవుతోంది. కానీ ఇప్పుడు మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

మహేష్ బాబుతో ఒకవైపు సినిమా తీయాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.. కానీ  త్రివిక్రమ్ సినిమాలు పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక మరొక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో  డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తుండగా.. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. కానీ మధ్యలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను  గట్టిగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.  ఏది ఏమైనా త్రివిక్రమ్ ఒకవైపు సూపర్ స్టార్ కాంపౌండ్ ను, మరొక వైపు మెగా కాంపౌండ్ ని వదిలి పెట్టేదేలేదు అని స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: