కనీస వసూళ్ల అయినా రాకపోతాయా అని ఆశ పడితే అది కాస్తా కేజీఎఫ్ చిత్ర తాకిడికి కొట్టుకుపోయింది అని అంటున్నారు. కేజీఎఫ్ సినిమా ముందు బెస్ట్ మూవీ పూర్తిగా తేలిపోయిందని... ఇప్పట్లో కేజీఎఫ్ చిత్ర హవా తగ్గేలా కనిపించని తరుణంలో బీస్ట్ మూవీ నిర్మాతకు ఇక్కట్లు తప్పేలా లేవని తెలుస్తోంది. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ -2 కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.... బీస్ట్ మూవీని తీసేసి ఆ థియేటర్లోనూ యశ్ చిత్రాన్ని వేసేలా ఉన్నారు అని సమాచారం. అదే కనుక జరిగితే బీస్ట్ సినిమాకి నష్టాల బీటింగ్స్ తప్పవు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రెండో వారం లో అయినా బీస్ట్ మూవీ ఊపందుకుంటోందో లేదో చూడాలి.
మొత్తానికి కన్నడ హీరో యశ్ కేజీఎఫ్ చిత్రంతో పాన్ హీరోగా బలమైన పాగానే వేశాడు. ఇతర భాషలలోని స్టార్ హీరోలతో సమానంగా ఆయా బాషల్లో అభిమానుల్ని పెంచుకుని క్రేజీ హీరోగా మారిపోయారు యశ్. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనే లేదు. ఏ ఇండస్ట్రీలో అందరూ ఈ యంగ్ డైరెక్టర్ టేకింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి