వాస్తవానికి పవన్ కు బాలీవుడ్ ప్రేక్షకులలో ఏమాత్రం ఇమేజ్ లేదు. గతంలో అతను నటించిన అనేక సినిమాలు హిందీలో డబ్ చేయబడినప్పటికీ అవి అక్కడ ఏమాత్రం విజయవంతం కాలేదు. దీనితో దర్శకుడు క్రిష్ ను నమ్ముకుని పవన్ పాన్ ఇండియా ప్రయోగం చేయడం ఒక విధంగా సాహసమే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
క్రిష్ కు హిందీలో సినిమాలు తీసిన అనుభవం ఉన్నప్పటికీ అతడు తీసిన ‘గబ్బర్’ మూవీ ఫ్లాప్. అయితే ‘మణికర్ణిక’ సక్సస్ అయినప్పటికీ ఆమూవీ నిర్మాణ సమయంలో క్రిష్ కు కంగనా రనౌత్ తో అభిప్రాయ భేదాలు రావడంతో ఆ మూవీ ప్రాజెక్ట్ నుండి చివరిలో తప్పుకోవడంతో క్రెడిట్ అంతా కంగనా ఖాతాలోకి వెళ్ళి పోయింది. అయితే పవన్ తో తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ కథ 14వ శతాబ్దానికి చెందిన మొగలాయి చక్రవర్తి ఔరంగ్ జేబ్ కాలం నాటిది.
ఉత్తరాది ప్రాంతంలో జనం ఇప్పటికీ ఔరంగ్ జేబ్ కిరాతకాలను గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆవిధంగా ఉత్తరాది ప్రాంతం వారికి తెలిసిన కథ కావడంతో పవన్ కు పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా పవర్ స్టార్ ను ఒత్తిడి చేసి ఒప్పించి ఈసినిమాలో నటించే విధంగా క్రిష్ పవన్ అంగీకారం పొందాడు అని అంటారు. అయితే పవర్ స్టార్ అభిమానుల భయాలు వేరు. టాప్ హీరోలు అంతా తమ సినిమాలతో పాన్ ఇండియా స్టార్స్ గా మారినప్పటికీ పవన్ కు ఉత్తరాదిలో పెద్దగా ఇమేజ్ లేని పరిస్థితులలో ఈ ప్రమోగం సక్సస్ అవ్వకపోతే పరిస్థితి ఏమిటి అని అభిమానుల సందేహాలు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి