సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. కొంత కాలం క్రితం ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 13 వ తేదీన విడుదల చేయలేక పోయారు.  ఆ తర్వాత మే 12 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సర్కారు వారి పాట చిత్రబృందం ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్, ట్రైలర్, కొన్ని సాంగ్స్ ని, అలాగే కొన్ని పోస్టర్స్ ని విడుదల చేసింది.  ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్ అన్నింటికీ కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.  ఈ తమన్ సంగీతం సమకూర్చాడు.  తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కళావతి సాంగ్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లో తెచ్చుకోవడం మాత్రమే కాకుండా యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సాధిస్తోంది.  అలాగే తాజాగా సర్కారు వారి పాట చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  

ట్రైలర్ లో మహేష్ బాబు చూపించిన వేరియేషన్స్ కు మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా...  ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా సర్కారు వారి పాట చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది.  సర్కారు వారి పాట చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది.  సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 7 వ తేదీన సాయంత్రం 6 గంటలకు పోలీస్ గ్రౌండ్స్ యూసుఫ్ గూడ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది. మరి సర్కారు వారి పాట సినిమా ఎ రేంజ్  విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: