మరొకసారి నాన్ స్టాప్ కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సిద్దం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే f2 సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ టీమ్ ఇప్పుడు మరొకసారి సినిమా సమ్మర్ సోగ్గాలుగా గా మనముందుకు వచ్చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ నెల 27వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఇందులో వరుణ్ తేజ్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటించగా , వెంకటేష్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ తో పాటు అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకొని 2:28 గంటల నిడివితో సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక తమన్నా,  మెహరిన్ తో పాటు సోనాలి చౌహాన్ ని కూడా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.తాజా గా వస్తున్న  వార్తలు ఏమిటంటే హాట్ అండ్ బోల్డ్ బ్యూటీస్ ని ఎంపిక చేసుకున్న అనిల్ రావిపూడి క్లీన్ యు సినిమా ఎలా తీయగలిగారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అంతే కాదు ఇది ఎలా పాజిబుల్ అన్న విషయం తెలియాలి అంటే తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అంటూ తెలుపుతున్నారు చిత్రం యూనిట్. ఇక అన్నపూర్ణ,  సునీల్,  ప్రగతి,  అలీ,  రాజేంద్రప్రసాద్,  మురళీశర్మ తదితరులు ఈ సినిమాలో కామెడీ పోషించడానికి సిద్ధమయ్యారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం గమనార్హం.

2022 మే 21వ తేదీన అనగా ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గ్రాండ్గా జరగనుంది.  ఇకపోతే సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అన్న విషయం పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇకపోతే అనిల్ రావిపూడిసినిమా ఎఫ్2 కు సీక్వెల్ కాదు అని దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు అని కూడా వివరించాడు. కానీ F4, F5 లు వుంటాయా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: