కోలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కొంత కాలం క్రితం విడుదల అయిన డాక్టర్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అనుకున్న శివ కార్తికేయన్ అదే సినిమాను తెలుగులో డాక్టర్ వరుణ్ పేరుతో విడుదల చేశాడు.  ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.  ఇలా డాక్టర్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయన్ తాజాగా కాలేజీ డాన్ సినిమాలో హీరోగా నటించాడు. 

సినిమా తమిళ,  తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగులో ఏ మాత్రం పబ్లిసిటీ చేయలేదు. పబ్లిసిటీ ఏ మాత్రం లేకుండా కాలేజ్ డాన్ మూవీ ని నేరుగా థియేటర్ లలో విడుదల చేశారు.  సినిమాకు తెలుగులో ఏమాత్రం పబ్లిసిటీ చేయనప్పటికీ మౌత్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతోంది.  అందులో భాగంగా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందో  తెలుసుకుందాం.
నిజాం : 61 లక్షలు
సీడెడ్ : 18 లక్షలు
యూ ఎ : 20 లక్షలు
ఈస్ట్ : 9 లక్షలు
వెస్ట్ : 6 లక్షలు
గుంటూర్ : 5 లక్షలు
కృష్ణ : 7 లక్షలు
నెల్లూర్ : 4 లక్షలు
ఇప్పటివరకు ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల షేర్ ,2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


కాలేజ్ డాన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో  1.3 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఆ లెక్క ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక 20 లక్షల షేర్ కలెక్షన్లను కనుక కాలేజ్ డాన్ మూవీ సాధించినట్లు అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: