టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తో సాక్షి వైద్య టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ కి వక్కంతం వంశీ కథ ను అందించగా, హిపాప్ తమిళమూవీ కి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

ఈ  మూవీ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్ లలో అఖిల్ అదిరిపోయే లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడం, సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వస్తున్న సినిమా కావడంతో ఏజెంట్ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ కి సంబంధించిన 'ఓ టి టి' పార్టనర్‌ గా అమెజాన్ ప్రైమ్  సంస్థ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ మూవీ  పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్  ను అమెజాన్ ప్రైమ్ వారికి భారీ డీల్ కు విక్రయించినట్టు తెలుస్తుంది.  త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఏజెంట్ మూవీ తో అఖిల్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: