ఈ సంవత్సరం ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఎన్నో విడుదల అయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ టాక్ ను టెక్గుకొని అదిరిపోయే కలెక్షన్లను కూడా సాధించింది. అయితే ఈ సంవత్సరం విడుదలైన కొన్ని స్టార్ హీరోల సినిమాలు మిక్సీడ్ , నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకొని కూడా బ్లాక్ దగ్గర  విడుదలైన తర్వాత కొన్ని రోజుల పాటు ఒక కోటి షేర్  కలెక్షన్లు తగ్గకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ వసూలు చేశాయి. అందులో చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.                                                                                                                                                                                                                                                                                                                                    ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆచార్య సినిమా ఒక కోటి షేర్ తగ్గకుండా మూడు రోజులపాటు బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ కి బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఐదు రోజుల పాటు ఒక కోటి షేర్ కలెక్షన్లకు తగ్గకుండా వసూలు చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆరు రోజుల పాటు ఒక కోటి షేర్ కు తగ్గకుండా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.                                                                                                                                                                                                                                                 ఇకపోతే ఈ అందరి హీరోల ను బీట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సర్కార్ వారి పాట సినిమాతో అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ లభించినప్పటికీ 11 రోజుల పాటు ఒక కోటి షేర్ కు తగ్గకుండా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టామినాను బాక్సాఫీస్ దగ్గర మరోసారి నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: