సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. విడుదలయిన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను తెచ్చుకున్న సర్కారు వారి పాట సినిమా ఆ టాక్ ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పై ఏ మాత్రం  అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్  చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 32.77 కోట్లు .
సీడెడ్ : 11.31 కోట్లు .
యూ ఎ : 12.21 కోట్లు .
ఈస్ట్ : 8.35 కోట్లు .
వెస్ట్ : 5.51 కోట్లు .
గుంటూర్ : 8.41 కోట్లు .
కృష్ణ: 5.73 కోట్లు .
నెల్లూర్  : 3.41 కోట్లు .
14 రోజుల బాక్సాపీస్ రన్ కి గాను సర్కారు వారి పాట మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 87.70 కోట్ల షేర్ , 132 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  సర్కారు వారి పాట సినిమా 14 రోజులకీ 6.65 కోట్ల కలెక్షన్ లను సాధించింది.
ఓవర్ సీస్ లో సర్కార్ వారి పాట మూవీ  12.30 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


ప్రపంచ వ్యాప్తంగా 14 రోజులకు గాను సర్కారు వారి సినిమా106.65 కోట్ల షేర్, 171.30 కోట్ల  గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ప్రస్తుతం కూడా సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: