హీరోగా నిర్మాతగా వరస ఫ్లాప్ లు ఎదురైనా కళ్యాణ్ రామ్ తన ధైర్యాన్ని కోల్పోవడం లేదు వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అతడు నటించిన ‘బింబిసార’ ఆగష్టులో విడుదల కాబోతోంది. చక్రవర్తి బింబిసారుడు జీవితాన్ని బ్యాక్ డ్రాప్ గా చూపెడుతూ కళ్యాణ్ రామ్ నటించిన ఒక ఫ్యాంటసీ సినిమా ఇది. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ అన్న సినిమాను ప్రారంభించాడు.
ఈమధ్యనే విడుదలైన ‘డెవిల్’ మూవీ ఫస్ట్ లుక్ ఈ మూవీ పై మరింత ఆశక్తిని పెంచుతున్నాయి. 1940 కి ముందు ఉన్న పరిస్థితులతో పాటు అప్పట్లో భారత్ లోని పరిస్థితిని ‘డెవిల్’ సినిమాలో చూపిస్తారని అంటున్నారు. అయితే ఈ ‘డెవిల్’ సినిమా ప్రారంభం అయినట్లు ఎక్కడా వార్తలు బయటకు రాకుండా ఈ మూవీ షూటింగ్ జూన్ ఫస్ట్ నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మొదట్లో ‘బింబిసార’ విషయంలో బాగా పబ్లిసిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన సినిమా గురించి లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నాడు.
విడుదలకు తెగ హడావిడి చేసి పబ్లిసిటీ ఇచ్చి అంచనాలు పెంచితే ఆ అంచనాలు పెరిగిపోయి ప్రేక్షకులు నిరాశపడితే సినిమాలు ఫెయిల్ అవుతాయి అన్న సందేహం కళ్యాణ్ రామ్ కు కూడ ఏర్పడినట్లు టాక్. ఇది ఇలా ఉండగా జూనియర్ తన లేటెస్ట్ మూవీని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో చేస్తూ ఉండటంతో ఈ మూవీతో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మూవీ నిర్మాతగా మారుతున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ స్టూడెంట్ పాలిటిక్స్ నేపధ్యంలో ఉంటుంది అంటున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ దక్షిణాది భాషలు అన్నింటిలోను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి జూనియర్ పక్కన నటించేందుకు ఒక బాలీవుడ్ బ్యూటీ కోసం అన్వేషణ కొనసాగుతున్న పరిస్థితులలో హీరోయిన్ అనన్యా పాండే పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి