కానీ మహేష్ బాబు ఇంకా మూస పద్ధతిలోనే సినిమాలు చేయడం ఆయన అభిమానులను ఏ మాత్రం మెప్పించ డం లేదు. మూడు ఫైట్స్ ఆరు పాటలు అన్న విధంగా మహేష్ బాబు ఇంకా సినిమాలు చేస్తూ ఉండటం జరుగుతుంది. అలా కాకుండా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వెళ్లి సినిమాలు ఎప్పుడు చేస్తాడు మహేష్ అని వారు కలలు కంటున్నారు. సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిన తీరు చూస్తుంటే అది ఓ ఐదు సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా గా తెలుస్తుంది
అప్పటి సినిమాను ఇప్పుడు చేస్తే రిజల్టు ఇలాగే ఉంటుంది మరి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తో చేయబోయే వెరైటీ గా చేయబోతున్నాడు అని మహేష్ సన్నిహితులు చెబుతున్నా రు. మరి ఈ చిత్రం కూడా రెగ్యులర్ మూస పద్ధతిలోనే సినిమా చేస్తే మహేష్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని మొదలుపెట్టి ఆపై వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ తన సినిమాల విషయం లో వైవిధ్యం చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి