అందాల ముద్దు గుమ్మ నజ్రియా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అంటే సుందరానికి మూవీ తో ఎంట్రీ ఇవ్వబోతోంది . ఈ మూవీ లో నాని హీరోగా నటించగా , ఈ మూవీ కి టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు . movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు .

అంటే సుందరానికి మూవీ జూన్ 10 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే మలయాళ , తమిళ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న నజ్రియా అంటే సుందరానికి మూవీ తో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించ బోతోంది. ఇప్పటికే నజ్రియా తమిళం లో నటించిన రాజా రాణి మూవీ తో తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అంటే సుందరానికి మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే నజ్రియా కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా క్రేజీ మూవీ అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కూడా తెలుగులో కొంత మంది స్టార్ హీరోలతో నటించాలని ఉంది అని తాజాగా చెప్పుకొచ్చింది. 

అసలు విషయం లోకి వెళితే... నజ్రియా తాజాగా నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ వార్త విన్న కొంత మంది అంటే సుందరానికి మూవీ కనుక మంచి సక్సెస్ అయినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ కోరిక నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు అని అభిప్రాయపడుతున్నారు. అంటే సుందరానికి మూవీ కి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: