మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి పెట్టి కొన్ని సంవత్సరాల పాటు తిరుమలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీ తో గ్రౌండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ తెచ్చుకొని చివరికి ఫ్లాప్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు, అందులో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, ఆ కారణంగా ఈ సినిమాను కొన్ని రోజుల పాటు చిరంజీవి హోల్డ్ లో పెట్టనున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలన్నీ అవాస్తవమని తెలుస్తోంది. భోళా శంకర్ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం లోని కీలక సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: