‘పుష్ప’ విడుదల తరువాత రష్మిక మ్యానియా తారా స్థాయికి చేరుకోవడంతో ఆమెకు బాలీవుడ్ లో కూడ విపరీతంగా ఫాలోయింగ్ ఏర్పడటంతో ఆమెకు బాలీవుడ్ మీడియా నేషనల్ క్రష్ అన్న బిరుదు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ బిరుదుకు సాయి పల్లవి మాత్రమే అర్హు రాలు అంటూ ‘విరాటపర్వం’ విడుదల తరువాత ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడితో మీడియా హోరెత్తి పోతోంది.


‘విరాటపర్వం’ కలక్షన్స్ పరంగా ఫెయిల్ అయినప్పటికీ ఆమూవీలో వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈమూవీలో అతి సహజంగా నటించిన ఈమె ఈసినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ లో బాగా నీరసంగా కనిపించడానికి ఆసీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆహారం తీసుకోకుండా కేవలం లిక్విడ్స్ పైనే ఉందట. ఈవిషయాన్ని ఆమె ఈమూవీ ప్రమోషన్ లో తెలియచేసిన తరువాత ఆమెను లేడీ పవర్ స్టార్ అంటూ ఆమె అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


మరికొందరైతే నేషనల్ క్రష్ గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈవిషయం పైనే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు మాత్రం సాయి పల్లవి అన్ని రకాల పాత్రలకు ఆమె సరిపోదని కేవలం ఆమె కొన్ని పాత్రలకు మాత్రమే సరిపోతుందని వాదిస్తున్నారు. అయితే ఈవిషయంలో సాయి పల్లవి అభిమానులు ఏమాత్రం ఏకీభవించకుండా ఆమె భవిష్యత్ నేషనల్ క్రష్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


ఇంత పేరు ఆమెకు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆమె ఎందుకనో కొత్త సినిమాలను తెలుగులో ఒప్పుకోవడంలేదు. ప్రస్తుతం ఈమె కన్నడంలో ఒక మూవీని చేస్తూ కన్నడ భాషను నేర్చుకుని తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను అంటోంది. సిక్స్ ప్యాక్ తో కనిపించే హీరోలకన్నా నాజుకుగా కనిపించే అబ్బాయిలు తనకు ఇష్టము అని చెపుతూ ప్రస్తుతానికి తన పెళ్ళి ఆలోచనలు లేవు అని చెపుతోంది. ఈమె పై అభిమానులు చేస్తున్న ఈ నేషనల్ క్రష్ ప్రచారానికి రష్మిక అభిమానులు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: