పునర్నవి భూపాలం తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే . అప్పుడప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించింది పునర్నవి. ఆ తర్వాత పిట్టగోడ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత మనసుకు నచ్చింది సినిమాతో మంచి హిట్ సంపాదించుకుంది ఆ తర్వాత ఎందుకో ఏమో వంటి చిత్రాలలో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

బిగ్ బాస్ సీజన్-3 రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈమె వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. అక్కడ ముక్కుసూటిగా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. సినిమాలలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన పునర్నవి బిగ్ బాస్ లో చిట్టి పొట్టి డ్రెస్సులతో హౌస్ ని హిట్ ఎక్కించిందని చెప్పవచ్చు. ఇక హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఆమె లవ్ ట్రాక్ నడిపిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక వీరిద్దరూ బిగ్ బాస్  హౌస్ లో నానా రచ్చ చేశారు . ఏది ఏమైనా వీరిద్దరి కెమిస్ట్రీ కుర్రకారును బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. టైటిల్ గెలవకపోయినా బయటికి వచ్చాక ఊహించని స్థాయిలో ఈమెకు క్రేజు దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాలలో, వెబ్ సిరీస్ లో నటించింది. ఇక సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. నిన్నటి రోజున యోగ డే సందర్భంగా.. ఈమె ఒక వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ నుంచి షేర్ చేసింది. అయితే ఈ బ్యూటీ రివర్స్ లో L షేప్ లో ట్రై చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: