రాణా కథానాయకుడిగా నటించిన విరాట పర్వం సినిమా కు వచ్చిన తొలి రోజు కలెక్షన్లు ఇప్పుడు రావడం లేదు. నిజం చెప్పాలంటే రెండు రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు డ్రాప్ రావడం గమనించవచ్చు. సినిమా హిట్ అనే పేరు వచ్చినా కూడా ఎందుకో కుటుంబ ప్రేక్షకులు, కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకి వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు అందుకే ఈ సినిమా కలెక్షన్లు ఇంతలా డ్రాప్ అవ్వడానికి కారణం అయ్యింది.

సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తప్పకుండా మంచి కలెక్షన్స్ సాధిస్తుందని భావించారు కానీ ఈ సినిమా కు మంచి పేరు వచ్చినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దానికితోడు వర్షాలు కూడా బాగా పడటంతో వారు సినిమా పై ఇంట్రెస్ట్ పట్టకపోవడానికి మరొక ప్రధాన కారణం అవుతుంది. చాలామంది ఈ సినిమాలోని కొన్ని అంశాలు చాలా బాగున్నాయి అని చెబుతున్నారు అంతేకాదు సున్నితమైన చాలా అంశాలను ఎంతో తెలివిగా దర్శకుడు హ్యాండిల్ చేశాడు అని కూడా అన్నారు. 

వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ లోనే విడుదల అవుతుందని ప్రేక్షకులు భావించారు మేకర్స్. మేకర్స్ కూడా ఆ విధంగానే ఈ సినిమాను విడుదల చేయాలని చూశారు కానీ థియేటర్లకు ప్రేక్షకులు మునుపటిలా కాకుండా రెగ్యులర్ గా వస్తూ ఉండటంతో ఈ సినిమాను థియేటర్లలో చూస్తారని వారు భావించి థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. అనుకున్న విధంగా ఈ సినిమా మంచి విజయం అయితే సాధించుకుంది కానీ కలెక్షన్లను రాబట్టుకోవడం లో మాత్రం విఫలం అయింది. అంతకుముందు రానా సినిమా కన్నా ఈ చిత్రానికి కలెక్షన్లు బాగా తక్కువగా వచ్చాయని టాక్ వినిపిస్తుంది. మరి కలెక్షన్లు రాకపోయినా తన సినిమా బిజినెస్ విషయంలో ఎంతో క్లియర్ గా ఉండే సురేష్ బాబు ఈ చిత్రం యొక్క ఓటీటీ లోనైనా పెట్టిన పెట్టుబడిని రాబట్టుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: