కమలహాసన్ తన 67 సంవత్సరాల సమయంలో ‘విక్రమ్’ మూవీతో సాధించిన ఘన విజయాన్ని చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల కలక్షన్స్ దాటిపోవడంతో ఈ మూవీ రన్ పూర్తి అయ్యేసరికి 500 కోట్ల మార్క్ దాటడం చాల సులువు అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి చర్చలు అదేవిధంగా ఈ మూవీలోని పాత్రధారులు గురించి అదేవిధంగా లోకేష్ కనకరాజ్ టేకింగ్ గురించి అనేక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ చివరి మూడు నిమిషాల సమయంలో హీరో సూర్య ఎంట్రీ ఈమూవీ ఘన విజయానికి అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన కొంచం సేపు అయినప్పటికీ అతడి పాత్రకు సంబంధించిన మేకోవర్ ఈ మూవీకి హైలెట్ గా మారింది.అయితే ఇదే మూవీలో క్లైమాక్స్ లో కనిపించిన టీనా పాత్రలో కనిపించిన  నటి గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒంటి చేత్తో విలన్ లని ఎదుర్కొంటూ శివంగిలా విలన్ ల పైకి దూకి కేవలం ఫోర్క్ లను ఆయుధాలుగా చేసుకుని ఫైట్ చేసిన ఆమె నటన చూసి చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. కమల్ కొడుకు ఇంట్లో పని మనిషిగా ఉన్న టీనా ఉన్నట్టుండి ‘టీనా రిపోర్టింగ్ సర్’ అంటూ రెచ్చిపోయి చేసిన ఫైట్ కూడ ఈమూవీ ఘన విజయానికి కీలకంగా మారింది.


ఈ మూవీలో టీనా గా నటించిన ఆ మహిళ పేరు వాసంతి. ఆమె కొరియోగ్రాపర్ అని తెలుస్తోంది. కోలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా ఆమె పని చేసింది. కమలహాసన్ పట్టుపట్టి ఆమెతో ఈ టీనా పాత్రను చేయించాడు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె నటించిన ఈ చిన్న పాత్రతో ఆమె నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఆమె అదృష్టం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: