మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల వల్ల కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి, ఖైదీ నెంబర్ 150 మూవీ తో గ్రాండ్ గా సినిమా ఇండస్ట్రీ లోకి రీ  ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం మాత్రం వరస పెట్టి గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళుతూ చిరంజీవి ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.  ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్  సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది.  ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి,  బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి,  మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకో సాంగ్ చిత్రీకరణ జరపవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో చిరంజీవి సల్మాన్ ఖాన్ తో పాటు మరో 700 మంది డాన్సర్ లు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: