టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని గురించి ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఇప్పటి వరకు తన కెరీర్ లో మాస్ మరియు  క్లాస్ సినిమాలలో నటిస్తూ ఇటు క్లాస్ ప్రేక్షకులకు అటు మాస్ ప్రేక్షకులను సమానంగా అలరిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే  రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత రామ్ పోతినేని 'రెడ్' సినిమాలో నటించాడు.  ఈ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూవీలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారు. రామ్ పోతినేని , బోయపాటి శ్రీను ఇద్దరికి కూడా ఇది మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.

ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ లో రామ్ పోతినేని పాత్రకు సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రామ్ పోతినేని , బాలకృష్ణ కు అభిమానిగా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: