ఇక
కరోనా క్రైసిస్ తర్వాత
హాలీవుడ్ లో అతిపెద్ద సంచలనం ఇది.
టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావెరిక్
సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక బిలియన్
అమెరికా డాలర్లను అధిగమించింది.ఇక టాప్ గన్-
టామ్ క్రూజ్ కి మొదటి బిలియన్ డాలర్ క్లబ్ మూవీగా రికార్డును నెలకొల్పింది.టామ్ క్రూజ్ తన 40 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో ఇంత గొప్ప పురోగతిని చూడటం ఇదే మొదటిసారి అన్న టాక్ కూడా వినిపిస్తోంది. జెట్ ఇంజిన్ లు యుద్ధవిమానాలతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉండే
టామ్ క్రూజ్ ఫార్ములా ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.తన ఇన్నేళ్ళ కెరీర్ లో ఆ మైలురాయిని అందుకోవడం
టామ్ కి ఇదే తొలిసారి. దీనికి ముందు 2018 వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 791 మిలియన్ల
అమెరికా డాలర్లను వసూలు చేసిన `మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్ అవుట్`
సినిమా టామ్ క్రూజ్ కి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.మావెరిక్
సినిమా నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ క్లబ్ ని అధిగమించింది.
ఈ ల్యాండ్ మార్క్ ఫీట్ ను సాధించిన రెండవ పాండమిక్ చిత్రంగా ఇక ఇది నిలిచింది.ఇక పాపులర్ వెబ్ సైట్ డెడ్ లైన్ ప్రకారం.. USD 521.7 మిలియన్లు అమెరికాలో వసూలు చేయగా..
అంతర్జాతీయ బాక్సాఫీస్ నుండి మొత్తం 484.7 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 1.006 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆదివారం నాటికి మొత్తం USD 1Bకి చేరుకోవడానికి కేవలం 31 రోజులు పట్టిందని టాప్ గన్ బృందం వెల్లడించింది.టాప్ గన్
సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో 160.5 మిలియన్ల డాలర్లను వసూలు చేసి తొలి వీకెండ్ రికార్డును కూడా నెలకొల్పింది.
టామ్ క్రూజ్ కెరీర్ లో ఒకే వారాంతంలో 100 మిలియన్ డాలర్లను అధిగమించిన మొదటి చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.