కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అటు తమిళ్ లోనే కాదు ఇటు తెలుగులోనూ స్టార్ హీరో ఇమేజ్ తో అభిమాన సైన్యాన్ని పెంచుకున్నాడు. ఈ హీరో ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా నేరుగా తీయకపోయినా టాలీవుడ్ లో మాత్రం ఇతడి క్రేజ్ కి ఏమాత్రం తక్కువ కాదు. సూర్య సినిమా వస్తుంది అంటే తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతగా ఈ హీరోకి తెలుగు లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ హీరో భార్య జ్యోతిక కూడా స్వతహాగా పెద్ద సెలబ్రిటీ అన్న విషయం తెలిసిందే. జ్యోతిక కూడా కోలీవుడ్, టాలీవుడ్ ఇలా రెండు ఇండస్ట్రీలోనూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అయితే కెరియర్ పీక్స్ లో వుండగానే సూర్య ను ప్రేమ వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు.

ఇవన్నీ పక్కన పెడితే హీరో సూర్య, జ్యోతికలు ఇండస్ట్రీలో అందమైన కపుల్స్ లో ఒకరు.  2006 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  కాగా తాజాగా హీరో సూర్య తన వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  దర్శకుడు  వసంత్ దర్శకత్వంలో వచ్చిన పోవెళ్ళం కేటుప్పర్ చిత్రం లో మొదటగా జ్యోతిక హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ సినిమాలో వసంత్ గారే జ్యోతిక ని హీరో సూర్య కి పరిచయం చేశారట. ఇక మొదటి సన్నివేశం ఇద్దరు చేయి పట్టుకుని నడిచే షాట్. ఆ చిత్రం తోనే వీరిద్దరికి పరిచయం జరిగింది. మూడో సినిమా కలిసి చేస్తున్న సమయంలో వీరి మద్య ప్రేమ చిగురించిందట.. ఆ తర్వాత కలిసి చాలా సినిమాలు చేశారు. హీరో సూర్య నే ముందుగా ప్రపోజ్ చేసినట్లుగా తెలియజేశారు.

ఇక వివాహం అనుకోగా  సూర్య తల్లితండ్రులు, బందువులు అస్సలు ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారని తెలిపారు. సినిమాల గురించి ఇంట్లో అసలు ఎప్పుడు కూడా డిస్కస్ చేయమని  సూర్య అన్నారు. కూతురు దియా కు మంచి తండ్రిగా ఉండాలని కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది అని అందుకోసం ఎప్పుడూ తన చిన్నారి తల్లికి నచ్చిన విధంగా ఉండటానికి నచ్చింది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని సూర్య తెలియజేశారు. జ్యోతిక తన జీవితంలోకి వచ్చి అంతా ఎంతో అందంగా మార్చేసిందని అన్నారు.  నాకేం కావాలో నాకన్నా జ్యోతికకే బాగా తెలుసు నన్నెప్పుడూ సర్ప్రైజ్ చేస్తూ సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుందని అన్నారు. ఇక తనతో గడుపుతున్నంతసేపు తన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషంగా ఉంటామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: