నటి పవిత్ర లోకేష్ ఇంకా నటుడు నరేష్ వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో కర్ణాటక మీడియా సంస్థ ఒకటి చేసిన స్టింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ తాను నరేష్ ఇద్దరం సహజీవనం చేస్తున్నామని చెప్పిన సంగతి కూడా తెలిసిందే.ఇక తాజాగా ఈ వ్యవహారం మీద పవిత్ర లోకేష్ భర్తగా చెబుతున్న సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవిత్రా లోకేష్ తో జీవితం తొలినాళ్ళలో చాలా బాగానే ఉందని అయితే మాకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత తనను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందని ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.ఇక ఆమెది కాపురాలు కూల్చే బుద్ధి అని, ఈ విషయం మీద నేను ఆమెకు చాలా సార్లు నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేశాను కానీ ఆమె వినలేదు అంటూ సుచేంద్ర ప్రసాద్ కన్నడ మీడియా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పవిత్ర నన్ను వదిలేసి వెళ్లిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నానని ఈ ఒంటరి జీవితమే చాలా బాగుందనిపిస్తుంది సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇక మొదటి నుంచి ఆమె ఇలాగే వ్యవహరించేదని ఆమె వల్ల చాలా మందికి అన్యాయం జరిగిందని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.


డబ్బులు కోసం లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం కోసమే ఇలాంటి పనులు చేస్తోందని ఆర్థికంగా నేను ఆమె ఊహించిన స్థాయిలో లేకపోవడం వల్లే ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. అయితే తనతో కలిసి ఉన్న సమయంలో కూడా కొంత మందితో ఆమె సంబంధాలు పెట్టుకుంది అనే విషయం తన దృష్టికి వచ్చిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కానీ ఆమె మీద ఉన్న ప్రేమ కారణంగా ఆ విషయాలు పట్టించుకోలేదు కానీ ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు.ఒకవేళ నరేష్ ను ఆమె వివాహం చేసుకున్నా  కూడా కేవలం ఆరు నెలల్లోనే నరేష్ డబ్బు ఆమె చేతికి రాగానే అతనిని కూడా వదిలేస్తుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదని ఇక ఫైనల్ గా ఆమెది దోచుకునే మనస్తత్వం అని సుచేంద్ర ప్రసాద్ కామెంట్ చేశారు. ఇక ఆయన ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ కంటే ముందే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: