మెగా బ్రదర్ నాగవైపు ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఉండగానే.. మరొకవైపు నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఆయనకు నష్టాలని మిగిల్చాయి. ఈ విషయాన్ని నాగబాబూ స్వయంగా అంగీకరించడం జరిగింది .అయితే వెండితెరపై కంటే బుల్లితెర మీద ఎక్కువగా మంచి పాపులర్ కి సంపాదించుకున్నారు. నాగబాబు కొన్ని సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రలు నటించడమే కాకుండా జబర్దస్త్ వంటి కామెడీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరించారు. ఈ షోలో తనదైన నవ్వులతో పూయించే నాగబాబు కొన్ని సంవత్సరాల తరువాత వాటికి దూరమయ్యారు.

అయితే అప్పుడు షో నిర్మాతలతో విభేదాలు కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వచ్చాడని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆ షో డైరెక్టర్లు కూడా బయటికి వచ్చేసి.. వీరితో కలిసి నాగబాబు జీ తెలుగులో అదిరింది అనే ఒక కామెడీ షో ని చేశారు కానీ ఇది కూడా అంతగా వర్కౌట్ కాలేదు.. దీంతో కొద్ది రోజులకే స్టార్ మా కు షిఫ్ట్ అయ్యారు నాగబాబు. అయితే నాగబాబు మాటీవీలోకి వచ్చిన తర్వాత అన్ని ఆయనకు అనుకూలంగానే జరుగుతున్నాయి. కామెడీ స్టార్స్ ధమాకా అనే పేరుతో చేస్తున్న ఈ షో తెలుగు ప్రేక్షకులను విశేషంగానే ఆకట్టుకుంటోంది.

ప్రారంభించిన కొన్ని నెలలు వ్యవధిలోని మంచి టిఆర్పి రేటింగ్ లో ఉన్నది. అయితే ఈ షోలో కనిపించిన వారంతా ఒకప్పుడు జబర్దస్త్,  ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లు ఉన్నవారు కావడం విశేషం. దీని వెనక నాగబాబు మాస్టర్ ప్లాన్ ఉందని.. ఆ షో నుంచి పాపులర్ కమెడియన్ బయటికి రావడం వెనుక మెగా బ్రదర్ హస్తం ఉందన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. గడిచిన కొద్ది కాల వ్యవధిలోని జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరు దూరమవుతూ ఉన్నారు. ఇప్పటికే పలువురు కమెడియన్స్ యాంకర్స్ కూడా మారడం జరిగింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: