బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బిత్తిరి సత్తి.. తెలంగాణ యాస లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన అద్భుతమైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా బిత్తిరి సత్తి యాంకరింగ్ చేస్తున్నాడు అంటే చాలామంది ఆయన కోసమే ఆ ప్రోగ్రాంలను చూస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.పోతే పలు న్యూస్ చానల్స్ ద్వారా బిత్తిరి సత్తి ఊహించని రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ముఖ్యంగా తీన్మార్ వార్తలు అంటూ మరెన్నో ప్రోగ్రామ్లకు హోస్టుగా వ్యవహరించిన బిత్తిరి సత్తి కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

ఇదిలావుంటే అటు సినిమాల ద్వారా ఇటు ప్రోగ్రాంల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి పెద్ద సినిమాల హీరోలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు..ఇకపోతే ఇటీవల సర్కారు వారి పాట సినిమాను ఉద్దేశించి మహేష్ బాబుతో బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.అయితే  ఇక సాధారణంగా యాంకర్లలో అత్యధిక పారితోషికం తీసుకుని యాంకర్ ఎవరు అంటే టక్కున సుమా అని చెప్పేస్తారు కానీ పారితోషకం విషయంలో సుమాను మించి బిత్తిరి సత్తి పారితోషకం తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇక  ముఖ్యంగా బుల్లితెరపై పనిచేసే ఎంతోమంది యాంకర్లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న టాప్ యాంకర్ గా బిత్తిరి సత్తి మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.ఇదిలావుంటే  ప్రస్తుతం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం.అయితే ఇతర యాంకర్లతో పోలిస్తే బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు చాలా డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఈయన ఇంటర్వ్యూల పై చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ నేపథ్యం లోనే షో నిర్వహకులు కూడా ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి వెనుకాడడం లేదు అని సమాచారం. బిత్తిరి సత్తి పెరు తెలియని వారంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు.ఈయన క్రేజ్ ప్రస్తుతం అంచ లాంచలుగా పెరిగిపోవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: