పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే. పవన్ అంటే ఆయన అభిమనులు పడి చస్తారు.అయితే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత, సినిమాల్ని వదిలేస్తానన్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్.కాగా పవన్ కళ్యాణ్  2019 ఎన్నికల్లో ఓడిపోయాక కాస్త సమయం దొరకగానే, మళ్ళీ సినిమాల్లో నటించాలనే నిర్ణయం తీసుకున్నారు.పోతే  ఈ నిర్ణయం కారణంగానే, జనసేన పార్టీ నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

ఇక ఇదిలావుంటే కరోనా పాండమిక్ రావడంతో, పవన్ కళ్యాణ్ సినిమా ప్లానింగ్ మొత్తం బెడిసికొట్టింది. ఇక లేదంటే, ఈపాటికి పవన్ కళ్యాణ్ నుంచి కనీసం నాలుగు సినిమాలైనా వచ్చేసి వుండేవి. అయితే ఒకేసారి దాదాపు ఐదు సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్, వాటిల్లో రెండిటిని మాత్రమే పూర్తిచేయగలిగారు.ఇక ఇదిలావుంటే తాజాగా  ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లు' సినిమా ఆగిపోయిందట. ఇకపోతే ఈ ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంటే, చిత్ర నిర్మాత నుంచి ఎలాంటి స్పందనా లేదు. 

అయితే ఇంకోపక్క దర్శకుడు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్‌సింగ్' సినిమాని ప్రకటించేసి, పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఇదిలావుంటే జనసేనాని అత్యంత సన్నిహితుడైన నిర్మాత, జనసేన నేత రామ్ తాళ్ళూరి ఓ సినిమా రూపొందించాల్సి వుంది పవన్ కళ్యాణ్‌తో.అయితే కానీ, ఆ సినిమా కూడా వెనక్కి వెళ్ళిపోతోంది. ఇక మైత్రీ సంస్థ, రామ్ తాళ్ళూరి సొంత బ్యానర్, ఏఎం రత్నం సొంత బ్యానర్..అయితే ఇవన్నీ ఇప్పుడు అయోమయంలో పడిపోయాయ్.పోతే... ఒకే హీరో, ఇంతమంది నిర్మాతల్ని అయోమయంలో పడేయడం గతంలో ఎన్నడూ లేదు.ఇక ప్రస్తుతం ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి...!

మరింత సమాచారం తెలుసుకోండి: