టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు అయిన లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న లావణ్య త్రిపాటి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య త్రిపాఠి , రితీశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సత్య , వెన్నెల కిషోర్ , నరేష్ అగస్త్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని మొదట జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత అనూహ్యంగా ఈ సినిమాను చెప్పిన తేదీ కంటే ముందు జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీని దాదాపు ఒక వారం రోజులు ముందుకు తీసుకు రావడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా,  ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి గన్ ఉంటె ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా హ్యాపీ బర్త్   డే చిత్ర బృందం ఈ సినిమా టిక్కెట్ ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 110 రూపాయలు గా , మల్టీప్లెక్స్ థియేటర్ లో 177 రూపాయలుగా ఉండునట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను తక్కువ టికెట్ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: