సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి కథానాయకగా అరంగేట్రం చేసిన సమంత మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టార్ డం ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తనతో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకుని అతనితో నాలుగు సంవత్సరాల పాటు కలిసుండి ఆ తర్వాత గత ఏడాది విడాకులు తీసుకుంది. ఇక విడాకుల ప్రకటన తర్వాత సామ్ తన సినీ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిందిమ్ తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు....

 అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాల్లో నటిస్తున్న సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ఇక సోషల్ మీడియాలో సమంతకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె లైఫ్ స్టైల్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల సమంత మొదటి జీతం గురించి ఓ నెటిసజన్ ఆమెను ప్రశ్నించగా సమంత అసలు విషయం చెప్పేసింది. తన మొదటి జీతం 500 రూపాయలు అని చెప్పింది.

అంతేకాదు తన కెరీర్ లో ఫస్ట్ టైం ఒక హోటల్లో సమావేశానికి హోస్ట్ గా దాదాపు 8 గంటలు పని చేశానని.. ఆ సమయంలో తనకు 500 రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపింది. ఇక ఈ ఘటన 10వ తరగతి లేదా 11వ తరగతిలో ఉన్నప్పుడు జరిగింది అంటూ ఓ వీడియోలో సమంత చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అప్పుడు 500 రూపాయలు తీసుకున్న సమంత ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే రెండవ హీరోయిన్గా నిలిచింది. తాజా నివేదికల ప్రకారం సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఆమె నటిస్తున్న హాలీవుడ్ సినిమాకి సమంత ఏకంగా 6 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: