
ఇక అలాగే మాధవన్ నటించిన రాకెట్రి దినంబి ఎఫెక్ట్ సినిమాలో కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ అప్పీరెన్స్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇకపోతే మరొక కోలీవుడ్ స్టార్ కూడా అతిధి పాత్రలో నటించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఆ స్టార్ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ఇక ఆయన ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతలకు బెస్ట్ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్ . ఈ సినిమాలో నయనతార నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ జవాన్ సినిమా కోసం సమయాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్రకు ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఇక ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ సెప్టెంబర్ లో 25 రోజులపాటు చెన్నైలో చిత్రీకరించనున్నారు. డైరెక్టర్ అట్లీ హీరో షారుక్ ఖాన్ తో ఉన్న స్నేహబంధం కారణంగానే విజయ్ ఇలా పారితోషకం తీసుకోకుండా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పాన్ ఇండియా సినిమా 2023 జూన్ 2న విడుదల కాబోతోంది.