విజయ్ దేవరకొండ చాల మ్యాన్ లీ గా ఉంటాడు. అందువల్ల అమ్మాయిలలో అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనికి తగ్గట్టుగా విజయ్ బాడీ లాంగ్వేజ్ మాట తీరు చాల డిఫరెంట్ గా ఉండటంతో చాలామంది అమ్మాయిలకు విజయ్ దేవరకొండ పై క్రష్ ఉంది. ఈ కారణం వల్ల వరస ఫ్లాప్ లు ఎదురవుతున్నప్పటికీ విజయ్ దేవరకొండ మ్యానియా ఏమాత్రం తగ్గడం లేదు.


ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అంతా బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తూ పాన్ ఇండియా మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడ చేరిపోయాడు. ఆగష్టులో విడుదల కాబోతున్న ‘లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ భవిష్యత్ తేలిపోతుంది.


ఈమూవీని ఛార్మీతో పాటు కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తూ ఉండటంతో కరణ్ జోహార్ విజయ్ కు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో తాను హోస్ట్ చేసే కార్యక్రమాలలో విజయ్ దేవరకొండ పై క్రేజ్ పెరిగే విధంగా కరణ్ జోహార్ కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు. నిర్మాతగా దర్శకుడుగా వ్యాఖ్యాతగా పేరుగాంచిన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘కాపీ విత్ కరణ్ జోహార్’ సీజన్ 7 త్వరలో డిస్ట్ నీ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది.


ఈ కార్యక్రమంలో అనేకమంది సెలెబ్రెటీలు పాల్గొనబోతున్నారు. ఈకార్యమంలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సార అలీ ఖాన్ పాల్గొంది. ఈ సందర్భంలో కరణ్ జోహార్ సారా ని అనేకరకాలుగా ప్రశ్నిస్తూ ప్రస్తుత తరం హీరోలలో ‘నీకు ఎవరి పై క్రష్ ఉంది’ అంటూ ప్రశ్నించిన ప్రశ్నకు సారా తన మనసులోని మాటను బయటపెట్టింది. తనకు విజయ్ దేవరకొండ పై విపరీతమైన క్రష్ ఉంది అంటూ ఒక సంచలనానికి తెర దించింది. గతంలో ఇలాగే జాన్వీ కపూర్ కూడ తనకు విజయ్ దేవరకొండ పై క్రష్ ఉంది అంటూ చెప్పి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనినిబట్టి చూస్తుంటే బాలీవుడ్ బ్యూటీస్ లో విజయ్ దేవరకొండ పై మ్యానియా బాగా పెరుగుతోంది అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: