దర్శకుడు విక్రమ్ కుమార్ డిఫరెంట్ సినిమాలు తీయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అతడి ఆలోచనలు ఎంత విభిన్నంగా ఉంటాయో ‘మనం’ సినిమా చూసినవారికి ఇట్టే అర్థం అవుతుంది. ‘మనం’ మూవీ తరువాత విక్రమ్ కుమార్ కు అక్కినేని ఫ్యామిలీతో చాల సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఆ అభిమానంతోనే నాగార్జున అఖిల్ తో ‘హలో’ మూవీ తీసే అవకాశం ఇచ్చినప్పటికీ విక్రమ్ కుమార్ అఖిల్ కు హాట్ ను అందివ్వలేకపోయాడు.



దీనితో గ్యాప్ తీసుకుని విక్రమ్ కుమార్ ఇప్పుడు నాగచైతన్యతో మరొక ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల అయింది. ఈ ట్రైలర్ చూసినవారు వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలు వింటుంటే ‘థాంక్యూ’ మూవీ చైతన్యకు కోరుకున్న హిట్ ను అందివ్వగలడా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి.



‘మనం ఎక్కడ ప్రారంభమయ్యామో గుర్తు పెట్టుకోకపోతే చేరిన గమ్యానికి అర్థం వుండదు’ అనే పాయింట్ చుట్టూ ఈ మూవీ కథ అల్లబడింది అన్న అభిప్రాయం ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. జీవితంలో విజయాలు సాధించిన యువకుడు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరినీ వెదుక్కుంటూ వెనక్కు వెళ్లి కృతజ్ఙతలు తెలియచేసే కథగా ఈ మూవీ కనిపిస్తోంది. ఇలాంటి కథలతో గతంలో కొన్ని సినిమాలలోని సీన్స్ కనిపిస్తాయి.





దీనితో ఈ సినిమాను చూసిన వారికి పాత సినిమాల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా ఎటువంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ గా వచ్చే వారం రాబోతోంది. ఈ మూవీలో చైతన్య పక్కన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తూ ఉండటంతో ప్రస్తుతం ఆమె పై కొనసాగుతున్న ఐరన్ లెగ్ ఇమేజ్ ఈ మూవీకి ఏదైనా మైనస్ అవుతుందా అంటూ చైతన్య అభిమానులు భయపడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: