పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం విడుదలైన భీమ్లా నాయక్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి.

కాకపోతే భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత చాలా రోజులకు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. అలాగే కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ వాయిదా పడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా హరిహర వీరమల్లు మూవీ సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ గా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే కేటాయించనునట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ లో నటించబోతున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కు భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్ కథకు పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అలాగే భవదీయుడు భగత్సింగ్ కాల్షీట్  లకు సంబంధించి కూడా హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో మరి కొన్ని రోజుల్లోనే భవదీయుడు భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: